Published : 13 May 2022 02:20 IST

Taj Mahal: ఆ 22 గదుల విషయాన్ని చరిత్రకారులకు వదిలేయండి..!

తాజ్‌మహల్‌పై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు

లఖ్‌నవూ: దేశ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్ చరిత్రపై నిజ నిర్ధారణకు గాను విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది. తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 గదులను తెరవాలంటూ పిటిషనర్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. ‘రేపు మీరు వచ్చి మా ఛాంబర్లను చూడటానికి అనుమతి అడుగుతారు. దయచేసి పిల్ వ్యవస్థను అపహాస్యం చేయొద్దు. ఈ అంశాన్ని చరిత్రకారులకు వదిలేద్దాం’ అంటూ వ్యాఖ్యానించింది.  

తాజ్‌మహల్‌ చరిత్రపై నిజ నిర్ధారణకు గాను విచారణ జరిపించాలని కోరుతూ అలహాబాద్‌ హైకోర్టులో భాజపా అయోధ్య యూనిట్‌ మీడియా ఇన్‌ఛార్జి రజనీశ్‌ సింగ్‌ శనివారం వ్యాజ్యం దాఖలు చేశారు. ‘‘వాస్తవం ఏదైనా సరే తెలుసుకోవడానికి తాజ్‌మహల్‌కు చెందిన మూసిఉన్న 22 గదుల తలుపులు తెరిపించాలి’’ అని వ్యాజ్యంలో కోరినట్లు పిటిషనర్‌ ఆదివారం మీడియాకు తెలిపారు. చారిత్రక స్మారకాలు, పురావస్తు ప్రాంతాలు వంటివాటికి సంబంధించి 1951, 1958 చట్టాల్లోని కొన్ని నిబంధనలను కూడా పక్కనపెట్టాలని రజనీశ్‌ సింగ్‌ పిటిషన్‌లో కోరారు. ఈ చట్టాల పరిధిలోనే తాజ్‌మహల్‌, ఆగ్రా కోట వంటివాటిని చారిత్రక స్మారకాలుగా ప్రకటించారు. కాగా, మొఘలుల నాటి కట్టడమైన తాజ్‌మహల్‌ ‘ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ సంరక్షణలో ఉంది. ఇది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని