Heavy Rains: ఉత్తరాదిని వణికిస్తున్న వరుణుడు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి దేశరాజధాని దిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Published : 10 Jul 2024 04:40 IST

పలు రాష్ట్రాలకు ‘రెడ్‌ అలర్ట్‌’
దిల్లీ ఐటీవో ప్రాంతంలో రహదారిపై నిలిచిన వాన నీరు

దిల్లీ, గువాహటి, పనాజీ: ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి దేశరాజధాని దిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల వరద నీరు ముంచెత్తడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోవాలో వరుసగా నాలుగోరోజు సైతం అతి భారీ వర్షాలు కురిసినట్లు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) ప్రకటించింది. మరోవైపు బుధవారం గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. ఈ ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.    

ఉత్తరాఖండ్‌ వరదల్లో కొట్టుకుపోయిన 17ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైనట్లు మంగళవారం ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య మూడుకి చేరుకుంది. బ్రహ్మపుత్ర దాని ఉప నదుల్లో ప్రమాదస్థాయికి దిగువనే వరద ప్రవహిస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. రాష్ట్రంలో వరద పరిస్థితి మెరుగుపడుతోందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని