
Chennai Rains: జలదిగ్బంధంలోనే చెన్నై.. రాత్రి నుంచి జోరువాన
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వీధులు జలమయమై నదులను తలపిస్తున్నాయి. దీంతో అక్కడి జనజీవనం పూర్తిగా స్తంభించింది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. 17 గంటలైనా.. చినుకు ఆగే సూచనలు కనిపించడంలేదు. అత్యధికంగా చోళవరంలో 22 సెంటీ మీటర్లు, గుమ్మిడిపూండీలో 18 సెంటీ మీటర్లు, ఎన్నూర్‌లో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలోనూ సాయంత్రం వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతవారణశాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే చెన్నై, నారపట్నం, పుదుచ్చేరి కరైకాల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఏడు ఓడరేవుల్లో కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. చెన్నైలో పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
20 జిల్లాల్లో రెడ్ అలర్ట్..
చెన్నై సహా ఉత్తర జిల్లాల్లో అతి భారీ వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మొత్తం 20 జిల్లాలకు ఇది వర్తిస్తుంది. ఈ జిల్లాల్లో గురువారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. ఇప్పటికే వర్షాల కారణంగా 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వరదల వల్ల చెన్నై శివారులో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సాయంత్రం తీరం దాటే అవకాశం..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం రాత్రి వాయుగుండంగా మారింది. చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది గురువారం సాయంత్రానికి మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యగా మహాబలిపురంలో పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: డిగ్రీ ప్రవేశాల కోసం... దోస్త్ నోటిఫికేషన్ విడుదల
-
General News
Andhra News: ఉద్యోగుల ఖాతాల్లో నగదు ఏమైంది?.. ఇంకా స్పష్టత ఇవ్వని ఆర్థికశాఖ
-
Movies News
Happy Birthday: గన్లతో ఫన్.. ‘హ్యాపీ బర్త్‌డే’ ట్రైలర్ చూశారా..!
-
Business News
Stock Market Update: 4 రోజుల వరుస లాభాలకు బ్రేక్!
-
Sports News
IND vs ENG : విరాట్‌కు జట్టు పగ్గాలపై ఇంగ్లాండ్ క్రికెటర్ కామెంట్స్!
-
Politics News
Andhra News: తప్పుడు నిర్ణయాలతో పోలవరం నిర్మాణంలో జాప్యం: షెకావత్‌కు చంద్రబాబు లేఖ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా