Ayodhya: బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు 29ఏళ్లు.. అయోధ్య, మథురలో భారీ బందోబస్తు!
అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు నేటితో 29ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య.. మథుర నగరాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటన జరగకుండా ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత రోజును విశ్వహిందు పరిషత్ ‘శౌర్య దివాస్’గా.. ముస్లిం
లఖ్నవూ: అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు నేటితో 29ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య, మథుర నగరాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత రోజును విశ్వహిందు పరిషత్ ‘శౌర్య దివాస్’గా.. ముస్లిం వర్గాలు ‘బ్లాక్ డే’గా పరిగణిస్తుంటాయి. అయితే, 2018లో అయోధ్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పుతో సమస్య పరిష్కారమైంది. అయినా.. ఏటా డిసెంబర్ 6న అయోధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందని పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రమే బలగాలు అయోధ్యకు చేరుకున్నాయి.
మరోవైపు మథురలో శ్రీకృష్ణుడికి సంప్రదాయం ప్రకారం నిర్వహించే పలు వేడుకలకు అనుమతి ఇవ్వాలని అఖిల భారత హిందూ మహాసభ, శ్రీకృష్ణ జన్మభూమి నిర్మాన్ న్యాస్. నారాయణి సేన, శ్రీకృష్ణ ముక్తి దళ్ పోలీసులను కోరగా.. అందుకు నిరాకరించారు. మరోవైపు అఖిల భారత హిందూ మహాసభ.. షహీ ఈద్గా మసీదులోనే శ్రీకృష్ణుడి అసలు జన్మస్థలం ఉందని.. అక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ప్రతిష్ఠిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మథుర నగరంలో పోలీసులు భారీగా మోహరించారు. మథురకు వచ్చే పలు రైళ్లు, బస్సు సర్వీసులను నేటి నుంచి నాలుగు రోజులపాటు నిలిపివేయనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
-
Sports News
IND vs AUS: వారు లేకపోవడం భారత్కు లోటే.. ఆసీస్ దిగ్గజం కీలక వ్యాఖ్యలు
-
Politics News
Arvind Kejriwal: ఇదే కొనసాగితే.. అభివృద్ధి ఎలా సాధ్యం?: కేజ్రీవాల్
-
Politics News
Nellore: కోటంరెడ్డితోనే ప్రయాణం..ఆయనే మా ఊపిరి: నెల్లూరు మేయర్
-
India News
కేజ్రీవాల్ రాజీనామాకు భాజపా డిమాండ్.. ఆప్ కార్యాలయం ముందు ఆందోళన