Nirmala Sitharaman: ఈ బడ్జెట్‌ సమావేశంలో.. నిర్మల ఎంత సేపు ప్రసంగించారంటే..?

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (2022-23) వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019లో పదవీబాధ్యతలు చేపట్టినామె..

Updated : 01 Feb 2022 18:46 IST

దిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (2022-23) వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019లో పదవీబాధ్యతలు చేపట్టినామె.. ఈ నాలుగేళ్ల బడ్జెట్‌ సమావేశాలతో పోలిస్తే.. ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశంలో తక్కువ సేపు (1గంట 30 నిమిషాలు) ప్రసంగించడం గమనార్హం. మంగళవారం ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ సమావేశం ప్రారంభమైంది. ఒడిశా చేనేత చీరను ధరించి ప్లారమెంట్‌లోకి అడుగుపెట్టినామె.. పేపర్‌లెస్‌ బడ్జెట్‌ను ట్యాబ్‌లో చూసి చదివారు.

గతంలో నిర్మల బడ్జెట్‌ ప్రసంగాల సమయ వ్యవధిని దృష్టిలో ఉంచుకుని.. ఈసారి బడ్జెట్‌ ప్రసంగం సుమారు గంటన్నరకు పైగా ఉండొచ్చని విశ్లేషకులు భావించారు. కానీ, సరిగ్గా 1 గంట 30నిమిషాలకే ఆమె ప్రసంగం ముగించారు. 2019లో తొలిసారి ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్‌ని ప్రవేశపెట్టినామె.. 2గంటల 15నిమిషాల పాటు ప్రసంగించారు. భారత చరిత్రలోనే అత్యంత ఎక్కువసేపు ప్రసంగించినట్లుగా  రికార్డు నెలకొల్పారు. 2020లో (162 నిమిషాలు), 2021లో తొలిసారి పేపర్‌లెస్‌ బడ్జెట్‌ పెట్టినామె.. 1గంట 40నిమిషాలు ప్రసంగించారు. ఈ ఏడాది 2022లో 1 గంట 30 నిమిషాల్లో ముగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని