Uttarakhand: ముస్సోరిలో ఆకట్టుకున్న వింటేజ్ కార్ల ర్యాలీ

ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో పాతకాలం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా వింటేజ్ కార్లన్నీ ఒకేచోట దర్శనమిచ్చాయి.

Updated : 12 Nov 2021 04:24 IST

ముస్సోరి: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో పాతకాలం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా వింటేజ్ కార్లన్నీ ఒకేచోట దర్శనమిచ్చాయి. ఇక్కడ నిర్వహించిన హెరిటేజ్ హిమాలయన్ కార్‌ ర్యాలీలో వింటేజ్ కార్లు ఆకట్టుకున్నాయి. ఫోక్స్ వాగన్ బీటిల్, ఇటాలియన్ ఫియట్ సహా పలు కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 92కు పైగా పాతకాలం నాటి కార్లు ఈ ర్యాలీలో కనువిందు చేశాయి. ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ మంత్రి సత్పాల్ మహరాజ్, మరో మంత్రి గణేశ్ జోషి, రచయిత రస్కిన్ బాండ్.. జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. సాధారణ కార్లు సైతం ర్యాలీలో పాల్గొన్నాయి. ఇండియన్ ఆటోమోటివ్ రేసింగ్ క్లబ్ వ్యవస్థాపకుడు, ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు నాజిర్ హుస్సేన్ జ్ఞాపకార్థం ఈ ర్యాలీ నిర్వహించారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని