ఏపీకి రూ.280 కోట్ల నిధుల ముంజూరుకు ఆమోదం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ (హెచ్‌ఎల్‌సీ) ఐదు రాష్ట్రాలకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) కింద అదనపు కేంద్ర సహాయాన్ని ఆమోదించింది. 2020లో వరదలు, తుఫాను, తెగులు దాడి వలన ప్రభావితమైన....

Published : 13 Feb 2021 15:17 IST

దిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ (హెచ్‌ఎల్‌సీ) ఐదు రాష్ట్రాలకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) కింద అదనపు కేంద్ర సహాయాన్ని ఆమోదించింది. 2020లో వరదలు, తుఫాను, తెగులు దాడి వలన ప్రభావితమైన రాష్ట్రాలకు నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. కాగా ఈ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది. జాతీయ విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (ఎన్‌డీఆర్‌ఎంఎఫ్) నుంచి నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి రూ.3,113.05 కోట్ల అదనపు కేంద్ర సహాయాన్ని హెచ్‌ఎల్‌సీ ఆమోదించినట్లు  కేంద్రం శనివారం ప్రకటన విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు రూ.280.76 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఖరీఫ్‌లో తెగులు కారణంగా నష్టపోయిన మధ్యప్రదేశ్‌కు అత్యధికంగా రూ.1,280 కోట్లు కేటాయించింది. బిహార్‌కు రూ.1,255.27 కోట్ల ఇవ్వనుంది. ఈ ఏడాది నివర్‌, బురేవి తుపానుల బారినపడ్డ తమిళనాడుకు రూ.63.14 కోట్లు (నివర్‌), రూ.223.77 కోట్లు (బురేవి)  కేటాయించింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి రూ.9.91 కోట్లు ఇచ్చేందుకు ఆమోదించింది.

ఇవీ చదవండి...

సామాన్యులే మా మిత్రులు..

రాహుల్‌ గాంధీపై భూకంపం ఎఫెక్ట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని