Updated : 14 Feb 2022 17:04 IST

Hijab Row: కర్ణాటకలో తెరుచుకున్న పాఠశాలలు.. పలుచోట్ల సెక్షన్‌ 144

దిల్లీ: హిజాబ్‌ వివాదంతో కర్ణాటకలో మూతపడిన విద్యాసంస్థలు సోమవారం తిరిగి తెరచుకున్నాయి. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇంటర్‌ కళాశాలలు మాత్రం బుధవారం వరకు మూసివేసే ఉండనున్నాయి. అయితే, పలుచోట్ల కొందరు విద్యార్థులు హిజాబ్‌తో పాఠశాలలకు రాగా.. వాటిని తొలగించిన తర్వాతే యాజమాన్యం లోనికి అనుమతించింది. ఈ సందర్భంలో పాఠశాల యాజమాన్యానికి/ విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం జరిగిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు పలు ప్రాంతాల్లో సెక్షన్‌ 144ను విధించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.

మంగళూరులో 144సెక్షన్‌

మంగళూరు పోలీస్‌ కమిషనరేట్‌లోని పరిధిలోని ఉన్నత పాఠశాలల సమీపంలో 200 మీటర్ల పరిధిలో సెక్షన్‌ 144ను అమలు చేస్తున్నారు. సోమవారం నుంచి ఫిబ్రవరి 19 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. హిజాబ్‌ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటితోపాటు ఉడుపి, శివమొగ్గ, దక్షిణ కన్నడ జిల్లాల్లోనూ విద్యాసంస్థల సమీపంలో సెక్షన్‌ 144 అమలు చేస్తున్నారు.

అది కుట్రలో భాగమే..

కర్ణాటకలో చోటుచేసుకుంటున్న హిజాబ్‌ వివాదం కుట్రలో భాగమేనని అనుమానిస్తున్నామని ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కర్ణాటక హోంశాఖ మంత్రి ఆరాగా జ్ఞానేంద్ర ఆరోపించారు. ఈ వివాదాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న ఆయన.. ఇది దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమే అని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును హైకోర్టు విచారిస్తున్నందున, న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని రాష్ట్ర హోంమంత్రి స్పష్టం చేశారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని