Himachal Pradesh: 97 మంది ఓటర్ల కోసం.. సాహసం

హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల పోలింగు శనివారం జరగనుండగా.. కర్సోగ్‌ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్‌ సిబ్బంది పెద్ద సాహసమే చేశారు.

Updated : 12 Nov 2022 08:27 IST

హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల పోలింగు శనివారం జరగనుండగా.. కర్సోగ్‌ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్‌ సిబ్బంది పెద్ద సాహసమే చేశారు. 97 మంది ఓటర్లు ఉన్న మాగన్‌ ప్రాంతానికి చేరుకునేందుకు సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో పర్వత ప్రాంతాల్లో ఓటింగ్‌ యంత్రాలు మోసుకుంటూ 4 కిలోమీటర్లు నడిచారు. చివర్లో ప్రమాదకరమైన రోప్‌వే సాయంతో సత్లుజ్‌ నది దాటారు. శుక్రవారం ఉదయం 11.00 గంటలకు మొదలైన వీరి ప్రయాణం ముగిసి పోలింగ్‌ స్టేషనుకు చేరుకునేసరికి చీకటి పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని