Modi Russia visit: మోదీ పర్యటన ఓ ‘గేమ్‌ ఛేంజర్‌’ - రష్యా

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల మాస్కో పర్యటన ఓ గేమ్‌ ఛేంజింగ్‌ పరిణామమని రష్యా అభివర్ణించింది.

Published : 10 Jul 2024 16:10 IST

దిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల మాస్కో పర్యటన, పుతిన్‌తో జరిగిన చర్చలు చరిత్రాత్మకమని రష్యా పేర్కొంది. ఈ పర్యటనను గేమ్‌ ఛేంజర్‌గా అభివర్ణించింది. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా రష్యా సైన్యంలో ఉన్న భారతీయులను వెనక్కి రప్పించడంతోపాటు పలు కీలకాంశాలపై పుతిన్‌-మోదీలు ప్రధానంగా దృష్టి సారించినట్లు భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం వెల్లడించింది.

ప్రస్తుతం అంతర్జాతీయంగా ఘర్షణ పూరిత భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మాస్కోలో పర్యటించి, పుతిన్‌తో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరపడం చరిత్రాత్మకమని, ఈ పరిణామం గేమ్‌ ఛేంజర్‌ అని భారత్‌లోని రష్యా దౌత్యవేత్త రోమన్‌ బాబుష్కిన్‌ పేర్కొన్నారు. మోదీ పర్యటనను యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా గమనించిందన్న ఆయన.. ఇరుదేశాల మధ్య వాణిజ్య విస్తరణ, స్థానిక కరెన్సీలో చెల్లింపులపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చలు జరిపారన్నారు. తమ సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను వెనక్కి పంపించే అంశంపై ఇరు దేశాలు ఒకేలా ఆలోచిస్తున్నాయని అన్నారు. దీనికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని