BMW Hit And Run: ‘పెద్ద తప్పు చేశా.. నా కెరీర్‌ ముగిసింది’: ముంబయి కారు ప్రమాద నిందితుడు

BMW Hit And Run: ముంబయి బీఎండబ్ల్యూ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ప్రధాన నిందితుడైన మిహిర్‌ షా సిట్‌ విచారణలో తన తప్పు అంగీకరించినట్లు సమాచారం.

Published : 11 Jul 2024 16:25 IST

ముంబయి: కారుతో ఢీకొట్టి ఓ మహిళ మృతికి కారణమైన ప్రధాన నిందితుడు తన తప్పును అంగీకరించాడు. ‘నేను చేసిన తప్పుని అంగీకరిస్తున్నా.. నా కెరీర్‌ ఇంతటితో ముగిసిపోయింది’ అని మిహిర్‌ షా సిట్‌ విచారణలో అంగీకరించాడు. శివసేన నేత రాజేశ్‌ షా కుమారుడు మిహిర్‌ షా ఇటీవల ముంబయిలోని వర్లీ ప్రాంతంలో తెల్లవారుజామున మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన మిహిర్‌, అతడి డ్రైవర్‌ రాజశ్రీ బిదావత్‌లను సిట్‌ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా నిందితుడు మిహిర్‌ తాను చేసిన తప్పునకు చింతిస్తున్నట్లు పోలీసుల ముందు వాపోయినట్టు సమాచారం.

ప్రమాద సమయంలో కారు కింద మహిళ ఇరుక్కున్న విషయం తెలియదని నిందితులు వెల్లడించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన తర్వాత కారు చక్రాల కింద మహిళ ఇరుక్కుపోయిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిందితుడు మహిళను కారుతో లాక్కెళ్తున్న సమయంలో కొందరు వాహనదారులు కారు ఆపమని వారించినా వినిపించుకోలేదని పోలీసులు తెలిపారు. వారు ఇచ్చిన వాంగ్మూలాలను ధ్రువీకరించాల్సి ఉందని వెల్లడించారు.

అలా 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన తర్వాత మిహిర్‌, అతడి డ్రైవర్‌ సీట్లు మార్చుకున్నారు. ఇంజన్‌ బే వద్ద ఉన్న మహిళ మృతదేహాన్ని తొలగించి రోడ్డుపై పడేశారు. అలాగే పోలీసుల్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో అతడు జుట్టు ట్రిమ్‌చేసి, గడ్డం గీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఘటన తర్వాత అతడు ఆటోలో గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు