రైతులతో అనధికార చర్చల్లేవు: తోమర్
దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో కేంద్రం ఎటువంటి అనధికార చర్చలు జరపట్లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు.
సరిహద్దుల్లో చర్యలు లా అండ్ ఆర్డర్‌కు సంబంధించినవి
దిల్లీ: దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో కేంద్రం ఎటువంటి అనధికార చర్చలు జరపట్లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో బారికేడ్ల ఏర్పాటు, ఇంటర్నెట్ నిషేధం వంటివి లా అండ్ ఆర్డర్‌కు సంబంధించిన విషయాలన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం వెల్లడించారు. నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించి జనవరి 22న చివరిసారి కేంద్రం రైతు సంఘాలతో చర్చలు నిర్వహించింది. 18 నెలల పాటు చట్టాలను నిలిపేస్తామన్న కేంద్రం ప్రతిపాదనపై రైతులు పునరాలోచించాలని కేంద్రం సూచించింది.
సరిహద్దుల్లో తమపై జరుగుతున్న వేధింపులు ఆపితేనే తరువాతి చర్చల్లో పాల్గొంటామని రైతులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తోమర్ మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్‌కు సంబంధించిన విషయంలో తాను కలుగజేసుకోన్నారు. రైతులు స్థానిక పోలీసు కమిషనర్‌తో మాట్లాడాలని ఆయన సూచించారు. రైతు ఉద్యమంపై పోలీసుల వేధింపులు ఆపేవరకూ ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొనబోమని రైతు సంఘాలు మంగళవారం స్పష్టం చేశాయి. అంతేకాకుండా పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న రైతులను విడుదల చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. జనవరి 22 తర్వాత చర్చల కోసం ఎటువంటి అధికారిక సమాచారం తమకు అందలేదని వారు తెలిపారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Maldives Elections: మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/10/2023)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం