Published : 08 Aug 2020 01:12 IST

అక్కడికెళ్తే  హోం ఐసోలేషన్‌ తప్పనిసరి‌‌!

కరోనా ఉద్ధృతి వేళ బీఎంసీ కీలక నిర్ణయం

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ముంబయి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబై నగరానికి వచ్చిన ప్రయాణికులెవరైనా 14 రోజులపాటు తప్పనిసరిగా హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ మేరకు బృహాన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) శుక్రవారం ఓ ప్రకటన జారీ చేసింది. దేశంలో ఎక్కడి నుంచైనా ముంబయికి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందేనని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా దీన్నుంచి మినహాయింపు పొందాలనుకుంటే మాత్రం రెండు రోజుల ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు బీఎంసీ ట్విటర్‌ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. 

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసును విచారించేందుకు పట్నా నుంచి ముంబయికి వచ్చిన పోలీస్‌ అధికారిని అధికారులు బలవంతంగా హోం క్వారంటైన్‌ చేసిన ఘటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మరోవైపు, మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజే 11514 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో 4,79,779 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 3,16,375 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 16,792 మంది మృతి చెందారు. 


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని