Center: వారికి ఇళ్లు ఇచ్చే ప్రణాళిక ఏదీ లేదు..!

దేశ రాజధానిలో రోహింగ్యా శరణార్థులకు ఇళ్లు కేటాయించాలని ఆదేశిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Published : 18 Aug 2022 02:01 IST

దిల్లీ: దేశ రాజధానిలో రోహింగ్యా శరణార్థులకు ఇళ్లు కేటాయించాలని ఆదేశిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలోకి ‘అక్రమంగా ప్రవేశించిన విదేశీయులు’ ప్రస్తుతమున్న ప్రదేశంలోనే ఉండేలా చూడాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సూచించింది.

మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలకు ఇళ్లు, భద్రత కల్పిస్తున్నట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ ఉదయం ట్వీట్ చేశారు. దీనిపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆ క్రమంలో అలాంటిది ఏం లేదంటూ కేంద్రం నుంచి ప్రకటన రావడం గమనార్హం. నిబంధనల ప్రకారం రోహింగ్యాలను దేశం నుంచి పంపించేవరకు వారిని డిటెన్షన్ కేంద్రాల్లోనే ఉంచాలని తెలిపింది. ప్రస్తుతం వారుంటున్న ప్రాంతాన్ని దిల్లీ ప్రభుత్వం వెంటనే డిటెన్షన్ కేంద్రంగా ప్రకటించాలని ఆదేశించింది. 

‘రోహింగ్యాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి దిల్లీలోని బక్కర్‌వాలా ప్రాంతంలోని ఈడబ్ల్యూఎస్‌(ఆర్థికంగా బలహీన వర్గాలు) ఇళ్లకు తరలిస్తున్నాం. అక్కడ వారికి కనీస సదుపాయాలు అందనున్నాయి. యూఎన్‌హెచ్‌సీఆర్ ఐడీలు, 24 గంటల భద్రత లభించనుంది. భారత శరణార్థి విధానాన్ని కావాలని సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)తో ముడిపెడుతూ విమర్శలు చేసేవారికి ఈ నిర్ణయం తీవ్రంగా నిరుత్సాహపరుస్తుంది. ఐరాస రిఫ్యూజీ కన్వెన్షన్‌(1951)ను భారత్‌ గౌరవిస్తుంది. జాతి, మతం అనే తేడా లేకుండా ఆశ్రయం ఇస్తుంది’ అని మంత్రి ట్వీట్ చేశారు. దీనిపై విశ్వహిందూ పరిషత్‌ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. ఆ శరణార్థులను దేశం నుంచి పంపించేసేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని