ఆ హోటల్‌లో  76మందికి కరోనా 

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గతంలో తగ్గినట్టే కనిపించిన ఈ మహమ్మారి వ్యాప్తి మళ్లీ మొదలై కలవరపెడుతోంది......

Published : 29 Mar 2021 17:57 IST

రిషికేశ్‌: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గతంలో తగ్గినట్టే కనిపించిన ఈ మహమ్మారి వ్యాప్తి మళ్లీ మొదలై కలవరపెడుతోంది. ఉత్తరాఖండ్‌ రిషికేశ్‌లోని తాజ్‌ హోటల్‌లో కరోనా కలకలం సృష్టించింది. 76మందికి కొవిడ్‌ సోకవడంతో మూడు రోజుల పాటు హోటల్‌ను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.  హోటల్‌ని శానిటైజ్‌ చేసిన అనంతరం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా  హోటల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కుంభమేళాకు హరిద్వార్‌ సన్నద్ధమవుతున్న వేళ కరోనా కేసులు వెలుగుచూడటంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ మేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నందున మరింత అప్రమత్తమైన సర్కార్‌.. కఠిన ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులకు కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి చేసింది. లేదంటే వ్యాక్సినేషన్‌ ధ్రువీకరణ పత్రమైనా ఉండాలని తెలిపింది. కుంభమేళా ఏప్రిల్‌ 1న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని