Parliament: ప్రభుత్వాలు వాడుతున్న విద్యుత్‌ వాహనాలెన్నో తెలుసా?

ఇటీవల కాలంలో విద్యుత్‌ వాహనాల(ఈవీ) వినియోగం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈవీలనే కొనుగోలు చేయాలని ప్రజలను కోరుతోంది. మరి అలాంటి ప్రభుత్వంలో ఎన్ని విద్యుత్‌ వాహనాలు ఉన్నాయో తెలుసా? కేంద్ర,

Published : 12 Feb 2022 02:10 IST

దిల్లీ: ఇటీవల కాలంలో విద్యుత్‌ వాహనాల(ఈవీ) వినియోగం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈవీలనే కొనుగోలు చేయాలని ప్రజలను కోరుతోంది. మరి అలాంటి ప్రభుత్వంలో ఎన్ని విద్యుత్‌ వాహనాలు ఉన్నాయో తెలుసా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కలిపి మొత్తం 8,47,544 వాహనాలను వినియోగిస్తుండగా.. వాటిలో 5,384 వాహనాలు మాత్రమే విద్యుత్‌ వాహనాలని కేంద్రం ఇటీవల పార్లమెంట్‌లో వెల్లడించింది. వాహనాలు, జాతీయ రహదారులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సమాధానాలిచ్చారు.

5,384 విద్యుత్‌ వాహనాల్లో స్థానిక సంస్థలు 1,352.. ప్రభుత్వ రంగం సంస్థలు 1,273.. రాష్ట్ర ప్రభుత్వాలు 1,237 వాహనాలను వినియోగిస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. రహదారుల విషయానికొస్తే భారతమాల పరియోజన తొలి దశ కింద ఆమోదించిన 34,800కి.మీ జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టులో ఈ ఏడాది జనవరి నాటికి 19,363 కి.మీ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని కేంద్రమంత్రి తెలిపారు. అంతేకాదు, నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకి అదనంగా రూ.59వేల కోట్లు ఆర్థిక సాయం చేసినట్లు వెల్లడించారు. 2014 నాటికి జాతీయ రహదారి నిర్మాణం 91,287కి.మీగా ఉండగా.. ఇప్పడది 1,41,190కి.మీకి చేరిందని నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని