Corona Vaccine: సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ ఇలా!

రోనాపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా మూడో దశ టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 18 ఏళ్ల పైబడిన అందరికీ టీకా వేసుకోవచ్చని కేంద్రం అనుమతించినప్పటికీ ......

Updated : 14 May 2021 18:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనాపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా మూడో దశ టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 18 ఏళ్ల పైబడిన అందరికీ టీకా వేసుకోవచ్చని కేంద్రం అనుమతించినప్పటికీ వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో అనేక రాష్ట్రాలు 45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోసు ఇవ్వడంపైనే దృష్టి కేంద్రీకరించాయి. దీంతో 45ఏళ్లు పైబడిన వారు టీకా వేయించుకుంటున్నారు. రెండు డోసులు తీసుకున్న ప్రతి ఒక్కరూ కొవిడ్‌ -19 వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం మరిచిపోవద్దు. ఎందుకంటే మీరు టీకా వేయించుకున్నారనేందుకు ఇదొక్కటే ఆధారం. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ వంటి కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటంతో ఒకచోట నుంచి ఇంకోచోటకు వెళ్లాలంటే టీకా వేయించుకున్నవారు ఈ సర్టిఫికెట్‌ను ఆధారంగా చూపించే అవకాశం ఉంటుంది.  టీకా తీసుకున్న ఏ వ్యక్తి అయినా వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో పొందొచ్చు.

ఈ సర్టిఫికేట్‌ను కొవిన్‌ అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..?

* ముందుగా కొవిన్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://www.cowin.gov.in/homeలోకి వెళ్లాలి.  రిజిస్టర్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

* మీ 10 అంకెల మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. 

*  మీ ఫోన్‌కు వచ్చే OTPతో సైన్‌ఇన్‌ అవ్వాలి.

* ఒకసారి లాగిన్‌ అయితే, మీ మొబైల్‌ నంబర్‌తో ఎంతమంది రిజిస్టర్‌ అయ్యారో జాబితాను అక్కడ చూపిస్తుంది. 

*  రెండు డోసులు తీసుకున్నవారి పేర్ల వద్ద వ్యాక్సినేటెడ్‌ అని గ్రీన్‌ బ్యానర్‌లో కనిపిస్తుంది.

* కుడి వైపున సర్టిఫికేట్‌ అనే బటన్ కనబడుతుంది. దానిపై క్లిక్‌ చేస్తే పీడీఎఫ్‌ ఫార్మాట్‌ ఫైల్‌ కొత్త ట్యాబ్‌/ విండోలో ఓపెన్‌ అవుతుంది. దాన్ని తీసుకొని భద్రపరుచుకోవడమే. 

*  అలాగే, ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా కూడా Vaccine Certificate డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొవిన్‌ ట్యాబ్‌లో వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. 

* లబ్దిదారుడి 13 అంకెల రిఫరెన్స్‌ ఐడీని ఎంటర్‌ చేయగానే మీ వివరాలు వస్తాయి. అక్కడే గెట్‌ సర్టిఫికేట్‌ అనే బటన్‌పై క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ పీడీఎఫ్‌ ద్వారా వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ను పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని