60 కేసులున్నా బెయిలుపై ఎలా బయటకొచ్చాడు..?
ఎనిమిది మంది పోలీసుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ చేపట్టాలని దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై భారత అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. దాదాపు 63కేసులు ఉన్న వ్యక్తి బెయిలుపై బయటకురావడం ఆందోళన కలిగిస్తోందని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఈ ఒక్క ఘటనకు సంబంధించిన విషయం కాదని, వ్యవస్థలోని వైఫల్యాన్ని ఇది ఎత్తిచూపిస్తోందని అన్నారు.
ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు
దర్యాప్తు కమిటీలో చేర్పులకు యూపీ ప్రభుత్వం అంగీకారం
దిల్లీ: ఎనిమిది మంది పోలీసుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ చేపట్టాలని దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై భారత అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. దాదాపు 63కేసులు ఉన్న వ్యక్తి బెయిలుపై బయటకురావడం ఆందోళన కలిగిస్తోందని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఈ ఒక్క ఘటనకు సంబంధించిన విషయం కాదని, వ్యవస్థలోని వైఫల్యాన్ని ఇది ఎత్తిచూపిస్తోందని అన్నారు. ఈ సందర్భంలో వికాస్ దుబే కేసులకు సంబంధించి జారీచేసిన అన్ని ఉత్తర్వులను అందజేయాలని జస్టిస్ ఎస్‌ఏ బోబ్డేతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
ప్రస్తుతం వికాస్‌దుబే ఎన్‌కౌంటర్ దర్యాప్తు కోసం అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో పాటు పోలీసు అధికారులను కూడా కమిటీలో ఉంచాలని సుప్రీంకోర్టు సూచించింది. దర్యాప్తు కమిటీలో మార్పులకు అంగీకరించిన యూపీ ప్రభుత్వం, జులై 22న దీనికి సంబంధించిన డ్రాఫ్టును కోర్టుకు అందజేస్తామని తెలిపింది. అనంతరం విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు: అనిత
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె
-
Ts-top-news News
ఎన్ఐటీ విద్యార్థుల హవా.. ప్రాంగణ నియామకాల్లో 1,326 మంది ఎంపిక