CoronaVirus: మేలు చేసే జింక్‌

శరీరానికి జింక్‌ ఎంతో మేలు చేస్తుంది. సరైన మోతాదులో శరీరానికి జింక్‌ అందించడం వల్ల ఇన్ఫెక్షన్లు, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతాయి. అలాగే ఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్స్‌ ఉత్పత్తి తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Updated : 25 May 2021 17:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శరీరానికి జింక్‌ ఎంతో మేలు చేస్తుంది. సరైన మోతాదులో శరీరానికి జింక్‌ అందించడం వల్ల ఇన్ఫెక్షన్లు, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతాయి. అలాగే ఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్స్‌ ఉత్పత్తి తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. యాంటీబాడీలలో కీలకంగా వ్యవహరించే జింక్‌, తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేయడంతోపాటు వైరస్‌తో పోరాడే రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది. శరీరంలో జింక్‌ లోపించడం వల్ల వైరల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. వైరల్‌ ఇన్ఫెక్షన్లు వ్యాధినిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. అందువల్ల జింక్‌ను రోజూ తీసుకోవడం వల్ల జింక్‌ లోపాన్ని అధిగమించడమే కాకుండా, వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో యాంటీ ఇన్ఫెక్టివ్‌, ఇతర యాంటీ పారాసిటిక్‌ ఔషధాలతో పాటు కొవిడ్‌-19పై పోరాటానికి జింక్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణుల వెల్లడి. అదేవిధంగా సార్స్‌ కొవ్‌2 కేసులలో ప్రతిరోజు 50 మి.గ్రా జింక్‌ తీసుకోవడం వల్ల కరోనా నుంచి త్వరగా కోలుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అడ్వాన్స్‌డ్‌ ఇన్‌ ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ జర్నల్‌  కథనంలో సార్స్ కోవ్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల కలిగే ప్రమాదాన్ని, తీవ్రతను జింక్‌ తగ్గించగలదని తెలిపింది. క్లినికల్‌ ఇమ్యునాలజీ జర్నల్‌ కథనం ప్రకారం రోజుకు 50 మి.గ్రా జింక్‌ తీసుకోవడం వల్ల కొవిడ్‌-19 తో పోరాడటానికి సరిపడే రోగ నిరోధక శక్తి లభిస్తుందని తేలింది.  

అయితే అతి ఎప్పుడూ అనర్థమే. కాబట్టి తగిన మోతాదులో మాత్రమే జింక్‌ను తీసుకోవాలి.  జింక్‌ మగవారికి రోజుకు 14 ఎంజీ, ఆడవారికి రోజుకు 11 ఎంజీ అవసరం. ఈ ఖనిజ లవణం సహజంగా  గింజ ధాన్యాలు, మాంసం, పాలు, పెరుగు, మజ్జిగ, ఛీజ్‌ వంటి వాటిల్లో లభిస్తుంది. జింక్‌ సప్లిమెంట్స్‌ తీసుకునేవాళ్లు వైద్యుల సూచనల మేరకు తగిన మోతాదులో జింక్‌ను తీసుకోవాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని