Delhi: పంద్రాగస్టు ముందు ఉగ్ర కలకలం.. దిల్లీలో 2వేల తూటాలు లభ్యం

స్వాతంత్ర్య దినోత్సవం సమయంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు చేసిన కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. దిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా రవాణా చేస్తోన్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు

Published : 12 Aug 2022 12:46 IST

దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సమయంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు చేసిన కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. దిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా రవాణా చేస్తోన్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున తూటాలను స్వాధీనం చేసుకున్నారు.

పంద్రాగస్టు వేళ ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు దేశ రాజధాని దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆనంద్ విహార్‌ ప్రాంతంలో సోదాలు చేపడుతుండగా కొందరు అనుమానాస్పదంగా కన్పించారు. దీంతో విచారణ జరిపి పోలీసులు ఆరుగుర్ని అరెస్టు చేశారు. నిందితులు ఆయుధాల స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 2వేల తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల దిల్లీలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts