Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఆయుధాల పట్టివేత..

జమ్మూకశ్మీర్‌లో కుప్వారా పోలీసులు సైన్యంతో కలిసి సోమవారం భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Updated : 19 Apr 2022 18:10 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో కుప్వారా పోలీసులు సైన్యంతో కలిసి సోమవారం పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 54 పిస్టల్ రౌండ్లు, 17 పిస్టల్ మ్యాగజైన్లు, 10 పిస్టల్స్‌తో పాటు ఐదు గ్రనేడ్లు ఉన్నాయి. హజామ్‌ మొహల్లా, తాడ్‌కర్నాలలో జరిపిన సెర్చ్‌ ఆపరేషన్‌లో ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లో భారీగా ఆయుధాల సరఫరా జరుగుతోందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో సోదాలను ముమ్మరం చేశారు.

కాగా.. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసు దర్యాప్తులో ఈడీ మార్చి 24న జమ్మూ కశ్మీర్‌లోని   పలువురు ప్రస్తుత, మాజీ అధికారులు, ఆయుధ డీలర్ల  ఇళ్లపై సోదాలు నిర్వహించింది. ఆ సోదాల్లో పలు ‘నేరారోపణ’ పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇవి జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వ అధికారులకు, ఆయుధాల డీలర్లకు మధ్య ఉన్న సంబంధాలను బయటపెట్టాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని