100 జిలిటెన్‌ స్టిక్స్‌, 350  డిటోనేటర్లతో రైల్లోకి..

కేరళలో ఓ రైలు ప్రయాణికురాలి వద్ద భారీగా పేలుడు పదార్థాలను అధికారులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఓ మహిళ చెన్నై-మంగళూరు ఎక్స్‌ప్రెస్‌ ఎక్కేందుకు కోజికోడ్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది

Updated : 26 Feb 2021 13:00 IST

కోజికోడ్‌: కేరళలో ఓ రైలు ప్రయాణికురాలి వద్ద భారీగా పేలుడు పదార్థాలను అధికారులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఓ మహిళ చెన్నై-మంగళూరు ఎక్స్‌ప్రెస్‌ ఎక్కేందుకు కోజికోడ్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది తనిఖీ చేస్తుండగా.. ఆమె వద్ద వందకుపైగా జిలిటెన్‌ స్టిక్స్‌, 350 డిటోనేటర్లు కన్పించాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఆ మహిళను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

బావులు తవ్వేందుకు జిలిటెన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు తీసుకెళ్తున్నానని సదరు మహిళ చెప్పినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. కేరళలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.

గురువారం ముంబయిలోనూ పేలుడు పదార్థాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిలిపి ఉంచారు. దీంతో అప్రమత్తమైన ముంబయి పోలీసులు యాంటిల్లా వద్ద భద్రతను పెంచారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని