
Published : 12 Apr 2021 01:26 IST
నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం
నోయిడా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్ 63 సమీపంలో మురికి వాడల్లో భారీ మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 150కి పైగా గుడిసెలు దగ్దమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో బహ్లోల్పూర్ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఘటనకు సంబంధించిన వీడియోను నోయిడా గౌతమ్ బుద్ద నగర్ పోలిస్ కమిషనర్ ట్విటర్లో పంచుకున్నారు.‘‘నోయిడా పోలిస్ స్టేషన్ ఏరియా 3 పరిధిలో బహ్లోల్పూర్ గ్రామంలో మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు ఆర్పడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు’’ అని ట్విటర్లో పోస్టు చేశారు.
ఇవీ చదవండి
Tags :