Published : 27 Jan 2021 17:49 IST

‘హెచ్1బీ’ భాగస్వాములకు బైడెన్‌ గుడ్‌న్యూస్‌!

వాషింగ్టన్‌: హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ భారీ ఊరట కల్పించారు. హెచ్‌4 వీసాదారుల పని అనుమతులు రద్దు చేసేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొచ్చిన నూతన వలస విధానాన్ని బైడెన్‌ సర్కార్‌ వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సరిగ్గా వారం రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం బైడెన్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. తాజా నిర్ణయంతో భారతీయ వలసదారులకు అధిక ప్రయోజనం కలగనుంది.

హెచ్-‌1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల(భార్యా లేదా భర్త)తో పాటు 21ఏళ్ల లోపు పిల్లలకు.. అమెరికా పౌరసత్వం, వలససేవల సంస్థ(యూఎస్‌సీఐఎస్‌) హెచ్‌4 వీసాలు జారీ చేస్తుంటుంది. అయితే తొలుత హెచ్‌4 వీసాదారులు అగ్రరాజ్యంలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుండేది కాదు. దీంతో హెచ్‌-1బీ వీసాదారులపై ఆర్థికభారం అధికంగా ఉండేది. ఈ నేపథ్యంలో హెచ్‌4 వీసాదారులు చట్టపరంగా అమెరికాలో ఉద్యోగం చేసుకునేలా పని అనుమతి కల్పిస్తూ 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి రాగానే.. వలస విధానంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. హెచ్‌4 వీసాదారులకు పని అనుమతులు రద్దు చేయనున్నట్లు యూఎస్‌ కోర్టుకు తెలిపారు. 

హెచ్‌1బీ వీసాదారుల భాగస్వాముల్లో చాలా మంది నిపుణులైన భారతీయ మహిళలే ఉన్నారు. ట్రంప్‌ సర్కార్‌ తీసుకొచ్చిన నిబంధనల కారణంగా పలువురి భవితవ్యం అయోమయంలో పడింది. ఈ క్రమంలో వారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ అమెరికా చట్టసభ్యులు గతేడాది డిసెంబరులో బైడెన్‌ను కలిశారు. హెచ్‌4 వీసాలతో అమెరికాలో పనిచేస్తున్న ఎంతోమంది విదేశీ మహిళలు.. వైద్యంతో పాటు  అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చట్టసభ్యులు తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వారి అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. హెచ్‌4 వీసాలపై ట్రంప్‌ విధానాలను వెనక్కి తీసుకోవాలని కోరారు.

ఇవీ చదవండి..

మరో నలుగురు భారత-అమెరికన్లకు కీలక పదవులు

అమల్లోకి బైడెన్‌ ఆర్థిక ప్రణాళిక

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని