లిబియాపై దండెత్తిన ఇసుక తుపాను

ఆఫ్రికా దేశం లిబియాను ఇసుక తుపాన్లు వణికిస్తున్నాయి. దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో తుపాన్ల ప్రభావం అధికంగా ఉంది. బలమైన గాలులు వీస్తుండటంతో నగరాలు, పట్టణాల్లో విద్యుత్తు స్తంభాలు పడిపోయి విద్యుత్తు వ్యవస్థ స్తంభించిపోయింది....

Published : 24 Mar 2021 14:35 IST

ట్రిపోలి: ఆఫ్రికా దేశం లిబియాను ఇసుక తుపాన్లు వణికిస్తున్నాయి. దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో తుపాన్ల ప్రభావం అధికంగా ఉంది. బలమైన గాలులు వీస్తుండటంతో నగరాలు, పట్టణాల్లో విద్యుత్తు స్తంభాలు పడిపోయి విద్యుత్తు వ్యవస్థ స్తంభించిపోయింది. దుకాణాలు మూసివేశారు. ప్రజలు ఇంటినుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇసుక తుపాన్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తుపాను కారణంగా రహదారులపై ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. రెండు రోజులుగా ఇసుక తుపాను ప్రభావం పెరగ్గా.. అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు