Bipin Rawat: రావత్‌ని కించపరిచేవారిని వెంటాడి పట్టుకోండి!

ఇటీవల ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ని కించపరిచేవారిని వదిలేదిలేదని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు.

Updated : 12 Dec 2021 00:12 IST

డీజీపీకి కర్ణాటక హోంమంత్రి ఆదేశం

బెంగళూరు: ఇటీవల ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ని కించపరిచేవారిని వదిలేదిలేదని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో రావత్‌పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డీజీపీ ప్రవీణ్‌ సూదన్‌ని ఆదేశించారు. డిసెంబర్‌ 8న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్‌ కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్ దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. దేశం గర్వించే బిపిన్‌ రావత్‌ త్యాగాల్ని అవహేళన చేసేలా తప్పుడు పోస్టులు పెడుతున్న వికృత మనస్కులను గుర్తించి కఠినంగా శిక్షంచాలని డీజీపీని హోంమంత్రి ఆదేశించారు. వారు సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన పోస్టుల ఆధారంగా అడ్రస్‌లను గుర్తించి.. వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని