సీతపై 42 ఏళ్ల అలక.. చాయ్‌తోనే జీవనం గడిపేస్తున్న రామచంద్ర

ఎవరైనా భార్యపై అలిగితే ఏం చేస్తారు. రెండు రోజులు అన్నం మానేస్తారు లేదా వారం రోజులు అలిగి మాట్లాడకుండా ఉంటారు.

Updated : 10 Dec 2022 08:12 IST

వరైనా భార్యపై అలిగితే ఏం చేస్తారు. రెండు రోజులు అన్నం మానేస్తారు లేదా వారం రోజులు అలిగి మాట్లాడకుండా ఉంటారు. కానీ ఒడిశాకు చెందిన ఓ భర్త మాత్రం.. 42 ఏళ్లుగా అలిగాడు. అప్పటి నుంచి అన్నం తినడం మానేసి కేవలం టీ తాగుతూ, అటుకులు తింటూ బతికేస్తున్నాడు. జైపుర్‌ జిల్లాలోని వికీపుర్‌ గ్రామానికి చెందిన రామచంద్ర(76)కు 22 ఏళ్ల వయసులో సీతతో వివాహం జరిగింది. 42 సంవత్సరాల క్రితం వీరిద్దరి మధ్య చిన్నగొడవ జరిగింది. ఓ రోజు రామచంద్ర కూలిపనికి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు. అన్నం పెట్టమని భార్యను అడిగాడు. కానీ ఆమె అనారోగ్యం కారణంగా వంట చేయలేదు. రామచంద్రకు అన్నం పెట్టలేకపోయింది. భార్య పరిస్థితిని అర్థం చేసుకోని రామచంద్ర.. తినడానికి అన్నం పెట్టలేదని ఆమెపై అలకపూనాడు. అప్పటి నుంచి కోపంతో అన్నం తినడం మానేశాడు. అలాగని ఆమెతో మాట్లాడటం మానేయలేదు. అన్యోన్యంగానే ఉంటున్నాడు. అన్నం మాత్రం ముట్టుకోవడం లేదు. అన్నం తినమని ఎంత మంది చెప్పినా ససేమిరా అంటున్నాడు. - ఈటీవీ భారత్‌

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు