Crime News: భార్యను కొట్టు డార్లింగ్‌.. నేను వీడియో కాల్‌లో చూస్తా!

తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని.. ప్రియురాలి ఆదేశాలతో తనను తీవ్రంగా కొడుతున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.

Updated : 26 Nov 2022 07:26 IST

తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని.. ప్రియురాలి ఆదేశాలతో తనను తీవ్రంగా కొడుతున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ఆగ్రాకు చెందిన ఓ మహిళకు రాబిన్‌ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. భర్తను వదిలేసి విడిగా ఉంటున్న హరిపర్వత్‌కు చెందిన ఓ మహిళతో రాబిన్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి రాబిన్‌ తన భార్య దగ్గరకు రావడం తగ్గించేశాడు. ఎప్పుడైనా రాబిన్‌ తన భార్య, పిల్లల వద్దకు వెళ్తే ప్రియురాలు వీడియో కాల్‌ చేసి భార్యను కొట్టమని కోరుతుంటుంది. అలా కొడుతుంటే చూసి సంతోషించేది.  బాధితురాలు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త ప్రియురాలు, ఆమె తల్లి యువకులను మభ్యపెట్టి డబ్బులు గుంజుకుంటారని, డబ్బులు ఇవ్వని వారిపై అత్యాచారం కేసులు పెడుతుంటారని ఆరోపించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని