PM Modi: హైదరాబాద్‌ బాలికను ప్రశంసించిన ప్రధాని

హైదరాబాద్‌కు చెందిన బాలికపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.  

Updated : 24 Sep 2023 17:19 IST

దిల్లీ: ప్రతి నెల మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ద్వారా కీలక అంశాలపై ప్రధాని మోదీ (PM Modi) ప్రసంగిస్తుంటారు. దీనిలో భాగంగా ఆయన హైదరాబాద్‌కు చెందిన ఆకర్షణ సతీశ్‌ (Akarshana satish)పై ప్రశంసలు కురిపించారు.

ఆకర్షణ సతీశ్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతోంది. పుస్తక పఠనంపై ఉన్న ఆసక్తితో ఇతరులను కూడా చదివించాలని ప్రయత్నిస్తోంది. తండ్రి డా. సతీశ్‌ కుమార్‌ ప్రోత్సాహంతో పుస్తకాలను సేకరించడం అలవాటు చేసుకుంది. అంతేకాకుండా ఆసుపత్రి అధికారుల అనుమతితో ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో, పలు ప్రాంతాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది.

చిన్న వయసులోనే సమాజానికి తన వంతు కృషి చేస్తున్నందుకు ఈ కార్యక్రమం ద్వారా ఆకర్షణని ప్రధాని మోదీ అభినందించారు. ‘‘ఆకర్షణ సతీశ్‌ చదవడం, కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఉన్న ఆనందాన్ని హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఈ బాలిక కృషికి నా అభినందనలు. ఆకర్షణను చూసి గర్విస్తున్నాను’’ అని అన్నారు. చిన్నారి ప్రయత్నానికి మెచ్చిన రాష్ట్రపతి నుంచి కూడా గతంలో ప్రశంసలు లభించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు