Mamata Banerjee: నాకు తెలుసు.. గంగూలీ హర్ట్ అయ్యాడు: మమత
బీసీసీఐ(BCCI) మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Sourav Ganguly)కి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) మరోసారి మద్దతుగా నిలిచారు.
కోల్‌కతా: బీసీసీఐ(BCCI) మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Sourav Ganguly)కి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) మరోసారి మద్దతుగా నిలిచారు. బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ పదవీ కాలాన్ని పొడిగించకుండా.. అతడి స్థానంలో రోజర్ బిన్నీని ఎందుకు నియమించారని ప్రశ్నించారు. 2019 నవంబర్ 19న బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన గంగూలీ పదవీ కాలం ఇటీవల ముగియగా.. బీసీసీఐ ఆయన్ను మరోసారి ఆ పదవిలో కొనసాగించకుండా పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే మమతా బెనర్జీ గంగూలీని ఐసీసీకి పంపాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అయితే, బీసీసీఐ చీఫ్‌గా రెండోసారి గంగూలీని కొనసాగించకపోవడంపై ఆమె గురువారం విలేకర్లతో మాట్లాడారు.
‘‘ఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గంగూలీని ఎందుకు అనుమతించలేదు? ఎవరైనా పోటీ చేస్తారనే కదా ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచారు. ఇది గంగూలీకి జరిగిన అన్యాయమే. అతడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. గంగూలీ చాలా అర్హతలు ఉన్నవాడు. దేశం గర్వపడేలా చేశాడు. అతడిని పక్కన పెట్టడానికి కారణమేంటి? ఆ పదవిని మరెవరికో కట్టబెడుతున్నారు. కారణమేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నా? సచిన్ తెందూల్కర్ పోటీలో ఉంటే అతడికీ నేను మద్దతు ఇచ్చేదాన్ని. గంగూలీ ఎంతో వినమ్రత కలిగిన వ్యక్తి. అతడు ఏమీ మాట్లాడలేదు. కానీ కచ్చితంగా బాధపడుతున్నాడని మాత్రం నాకు తెలుసు. ఎవరో వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వడానికి ఇలాంటి రాజకీయ ప్రతీకారానికి పాల్పడటం సిగ్గుచేటు’’ అని దీదీ పేర్కొన్నారు. మరోవైపు, బీసీసీఐ అధ్యక్ష పదవికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య రాజకీయ విమర్శలు కొనసాగాయి. గంగూలీ భాజపాలో చేరేందుకు అంగీకరించకపోవడం వల్లే రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే, భాజపా దీటుగా బదులిచ్చింది. తృణమూల్ కాంగ్రెస్సే రాజకీయాలు చేస్తోందని.. ముందు బెంగాల్లో క్రీడలను అభివృద్ధిచేసేందుకు దృష్టిపెట్టాలని హితవుపలికింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Yuvagalam: యువగళం పాదయాత్ర.. సొమ్మసిల్లిన సినీనటుడు తారకరత్న
-
Sports News
Axar Patel : ప్రియురాలిని వివాహమాడిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్..
-
India News
Pariksha Pe Charcha: విద్యార్థులతో ప్రధాని మోదీ ‘పరీక్షాపే చర్చ’
-
Movies News
Srinivasa Murthy: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత
-
World News
Elon Musk: కాలేజ్‌కు వెళ్లేది చదువుకోవడానికి కాదట..!
-
Politics News
Yuvagalam: నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం