Published : 20 Sep 2021 23:51 IST

IAEA: శరవేగంగా ఉత్తర కొరియా అణుకార్యక్రమం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరకొరియా అణుకార్యక్రమం శరవేగంగా జరుగుతోందని ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఏజెన్సీ పేర్కొంది. సంస్థ వార్షిక సమావేశంలో చీఫ్‌ రఫేల్‌ గ్రోసీ  మాట్లాడుతూ సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘డెమోక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియాలో  అణుకార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. ముఖ్యంగా ఫ్లూటోనియంను వేరు చేయడం, యురేనియం శుద్ధితో పాటు ఇతర అంశాలపై వారు దృష్టి సారించారు’’ అని పేర్కొన్నారు. గత నెలలో ఉత్తరకొరియా న్యూక్లియర్‌ రియాక్టర్‌ను ప్రారంభించింది. అణ్వాయుధం కోసం ఫ్లూటోనియం తయారీకి దీనిని ప్రారంభించినట్లు అనుమానిస్తున్నారు. 

ఐఏఈఏ సంస్థ యాంగ్‌బ్యొన్‌ అణుకేంద్రం ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించగా.. జులై నుంచి కూలింగ్‌ వాటర్‌ బయటకు వెళుతున్నట్లు గుర్తించింది. రియాక్టర్‌ పనిచేస్తున్న విషయాన్ని ఈ అంశం ధ్రువీకరిస్తోంది. సింగపూర్‌లో 2018లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉ.కొరియా అగ్రనేత కిమ్‌ జొంగ్‌ ఉన్‌తో భేటీ  జరిగిన కొన్ని నెలల్లోనే దీనిని మూసివేశారు.ఇదే కాంప్లెక్సులో ఉన్న అణు ఇంధన రీప్రాసెస్‌ ల్యాబోరేటరీ కూడా పనిచేస్తోందని ఐఏఈఏ పేర్కొంది.  ఈ ల్యాబ్‌ పనిచేయడం భవిష్యత్తులో తీవ్ర సమస్యలకు కారణమవుతుందని పేర్కొంది. ఇది ఐరాస భద్రతా మండలి తీర్మానానికి వ్యతిరేకమని వెల్లడించింది.

ఇటీవలే ఉత్తర కొరియా మొట్టమొదటి క్రూజ్‌ క్షిపణిని పరీక్షించింది. ఇది 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. తాజా పరీక్ష ఐరాస ఆంక్షల ఉల్లంఘన కాదు. కానీ, ఉ.కొరియా కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం ఆపలేదు. ‘ఈ పరీక్ష వ్యూహాత్మకంగా ప్రత్యర్థులను భయపెట్టి ప్రభావవంతమైన రక్షణ కల్పిస్తుంది. అంటే ప్రత్యర్థి దేశాల సైనిక చర్యల నుంచి కచ్చితమైన రక్షణ ఉంటుంది’ అని ఉత్తరకొరియా న్యూస్‌ ఏజెన్సీ కేసీఎన్‌ఏ పేర్కొంది. ఈ ప్రయోగానికి కిమ్‌ హాజరు కాలేదు. ఈ పరీక్షను జాగ్రత్తగా పరిశీలించి అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థలతో కలిసి విశ్లేషిస్తామని దక్షిణ కొరియా ప్రతినిధులు తెలిపారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని