IAF: కుప్పకూలిన వాయుసేన విమానం

వాయుసేనకు చెందిన మిరాజ్‌ 2000 ఫైటర్‌ జెట్‌ విమానం నేడు కుప్పకూలింది. మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడినట్లు వాయుసేన పేర్కొంది. భింద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోని మనకాబాద్‌ వద్ద ఖాళీ ప్రదేశంలో విమానం కూలినట్లు తెలుస్తోంది.  

Updated : 21 Oct 2021 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాయుసేనకు చెందిన మిరాజ్‌ 2000 ఫైటర్‌ జెట్‌ విమానం నేడు కుప్పకూలింది. మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడినట్లు వాయుసేన పేర్కొంది. భింద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోని మనకాబాద్‌ వద్ద ఖాళీ ప్రదేశంలో విమానం కూలినట్లు తెలుస్తోంది.  

శిక్షణలో భాగంగా ఈ విమానం ఉదయం సెంట్రల్‌ సెక్టార్‌ నుంచి గాల్లోకి ఎగిరింది. అనంతరం ప్రమాదానికి గురైంది. 
ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలిలో విమానం తోక భాగం నేలలో కూరుకుపోయి కనిపిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు వాయుసేన భావిస్తోంది. ఈ ప్రమాదానికి కారణాలను అన్వేషించేందుకు దర్యాప్తు ప్రారంభించింది. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని