Shaliza Dhami: వాయుసేన చరిత్రలో తొలిసారి.. యుద్ధక్షేత్రంలోకి మహిళ..!
భారత వాయుసేన నుంచి ఓ చరిత్రాత్మక నిర్ణయం వెలువడింది. మహిళా దినోత్సవం వేళ.. గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామి(Shaliza Dhami)కి కీలక బాధ్యతలు అప్పగించింది.
దిల్లీ: మహిళా దినోత్సవం వేళ.. భారత వైమానిక దళం(IAF) ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళలు నేరుగా యుద్ధక్షేత్రంలో విధులు నిర్వర్తించే అవకాశాన్ని ఇచ్చింది. ఈ మేరకు గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామి(Shaliza Dhami)కి పశ్చిమ సెక్టార్‌లోని ఫ్రంట్‌లైన్ కాంబాట్ యూనిట్‌లో కమాండ్ బాధ్యతలు అప్పగించింది. రణరంగంలో నాయకత్వ బాధ్యతను మహిళకు అప్పగించడం ఇదే తొలిసారి.
ధామి(Shaliza Dhami).. 2003లో హెలికాప్టర్ పైలట్‌గా భారత వాయుసేనలోకి అడుగుపెట్టారు. ఆమెకు 2,800 గంటలు హెలికాప్టర్ నడిపిన అనుభవం ఉంది. పశ్చిమ సెక్టార్‌లో హెలికాప్టర్ యూనిట్‌కు ఫ్లైట్ కమాండర్‌గా వ్యవహరించారు. వాయుసేనలో గ్రూప్ కెప్టెన్ అంటే ఆర్మీలో కల్నల్‌తో సమానం. ప్రస్తుతం ఆమె ఫ్రంట్‌లైన్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆపరేషన్ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి మెడికల్ విభాగం దాటి ఆర్మీ కూడా మహిళలకు కమాండింగ్ బాధ్యతలు అప్పగిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
India News
Pankaja Munde: నేను భాజపా వ్యక్తినే.. కానీ, పార్టీ నాది కాదు!
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్