Abhinandan Varthaman: అభినందన్‌కు పదోన్నతి!

బాలాకోట్‌ ఎయిర్‌స్ట్రైక్‌ ఘటన అనంతరం భారత్‌, పాక్‌ మధ్య జరిగిన ఘర్షణలో ధైర్యసాహసాలు చూపిన భారత వైమానికదళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు తాజాగా పదోన్నతి లభించింది. కమాండర్‌ నుంచి గ్రూప్‌ కెప్టెన్‌గా నియమిస్తూ భారత వైమానికదళం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్‌ కెప్టెన్‌

Updated : 04 Nov 2021 10:57 IST

దిల్లీ: బాలాకోట్‌ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయసేన దాడుల అనంతరం  భారత్‌, పాక్‌ మధ్య జరిగిన ఘర్షణలో ధైర్యసాహసాలు చూపిన భారత వైమానికదళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు తాజాగా పదోన్నతి లభించింది. కమాండర్‌ నుంచి గ్రూప్‌ కెప్టెన్‌గా నియమిస్తూ భారత వైమానికదళం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్‌ కెప్టెన్‌ ర్యాంక్‌ అనేది సైనికదళంలో కల్నల్‌ ర్యాంక్‌తో సమానం. బాలాకోట్‌ ఘటన జరిగిన మరుసటి రోజు 2019 ఫిబ్రవరి 27న పాక్‌ వైమానిక దళం ఎఫ్‌-16 విమానంతో భారత్‌పై దాడికి యత్నించగా.. భారత వైమానిక కమాండర్‌ అభినందన్‌ మిగ్‌-21 విమానంతో వెంటాడి నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్‌ సాయంతో కిందకు దూకగా అది పాక్‌ భూభాగంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని పాక్‌ జవాన్లు అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారు. కాగా.. అభినందన్‌ను తిరిగి అప్పగించాలని భారత్‌ నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాక్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో పాక్‌ సైన్యం అతడిని వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించింది. చికిత్స కోసం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న అభినందన్‌ తిరిగి విధుల్లోకి చేరి దేశసేవను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అభినందన్‌కు పదోన్నతి దక్కింది. పాక్‌ వైమానికదళంతో వీరోచితంగా పోరాడినందుకుగానూ అభినందన్‌ను భారత ప్రభుత్వం 2019లోనే వీర్‌ చక్ర అవార్డుతో సత్కరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు