
Afghanistan: కాబుల్ నుంచి భారత్ చేరిన ఎంబసీ అధికారులు
దిల్లీ: కల్లోలిత అఫ్గానిస్థాన్ నుంచి భారత అధికారులు స్వదేశానికి చేరుకున్నారు. రాయబార కార్యాలయ అధికారులు, సిబ్బందితో కాబుల్ నుంచి బయల్దేరిన వాయుసేన ప్రత్యేక విమానం ఈ ఉదయం 11.15 గంటల ప్రాంతంలో గుజరాత్‌లోని జాంనగర్ ఎయిర్‌బేస్ వద్ద ల్యాండ్ అయ్యింది. ఈ సి-17 విమానంలో 120 మందికి పైగా రాయబార కార్యాలయం, భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఉన్నారు. కొందరు భారత పౌరులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సొంతగడ్డపై అడుగుపెట్టగానే వారంతా భావోద్వేగం చెందారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.
సోమవారం కూడా కాబుల్ నుంచి కొంతమంది ఎంబసీ సిబ్బందిని భారత్ స్వదేశానికి తరలించింది. ఆ తర్వాత అఫ్గాన్ గగనతలం మూసివేయడంతో అక్కడికి విమానాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. అమెరికాతో చర్చించి ఎంబసీ అధికారులను రప్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే నేడు మరో విమానం కాబుల్ నుంచి భారత్‌కు చేరుకుంది.
ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కాబుల్‌లోని భారత్ ఎంబసీని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంబసీ సిబ్బందితో పాటు వారి కుటుంబసభ్యులను కూడా భారత్‌కు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఇక అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను కూడా త్వరలోనే దేశానికి తీసుకొస్తామని అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.