Karnataka: కొండపై చిక్కుకుపోయిన పర్వతారోహకుడు.. రక్షించిన వైమానిక దళం

కర్ణాటకలోని నందిహిల్స్‌ కొండపై ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన ఓ పర్వతారోహకుడిని భారత వైమానిక దళం కాపాడింది.

Published : 22 Feb 2022 01:36 IST

బెంగళూరు: కర్ణాటకలోని నందిహిల్స్‌ కొండపై ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన ఓ పర్వతారోహకుడిని భారత వైమానిక దళం కాపాడింది. 19 ఏళ్ల ఓ పర్వతారోహకుడు.. చిక్‌బళ్లాపూర్ జిల్లా బ్రహ్మగిరి పర్వతంపై ట్రెక్కింగ్ చేస్తూ ఆదివారం ప్రమాదవశాత్తు 300 అడుగుల కిందికి పడిపోయి.. కొండ అంచు వద్ద చిక్కుకుపోయాడు. యువకుడు గల్లంతైనట్లు సమాచారం అందుకున్న చిక్‌బళ్లాపూర్ జిల్లా అధికార యంత్రాంగం.. సహాయం కోసం యలహంకలోని భారత వైమానిక దళ కేంద్రాన్ని సంప్రదించింది. వెంటనే స్పందించిన వైమానిక దళం అధికారులు హెలికాప్టర్‌ను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. కొండ అంచున చిక్కుకున్న యువకుడిని గుర్తించి కాపాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని