Updated : 12 May 2022 14:52 IST

IAF: హనీట్రాప్‌లో ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి.. పాక్‌ మహిళకు కీలక సమాచారం

అరెస్టు చేసిన దిల్లీ పోలీసులు

దిల్లీ: దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలక, సున్నితమైన సమాచారాన్ని.. పాకిస్థాన్‌కు చెందిన ఓ ‘ఏజెంట్‌’కు లీక్‌ చేశాడన్న ఆరోపణలపై భారత వైమానిక దళానికి చెందిన ఉద్యోగిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడు హనీట్రాప్‌లో చిక్కుకుని ఈ సమాచారాన్ని బయటకు పంపించినట్లు క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఆరోపించారు. 

భారత వైమానిక దళంలో గూఢచర్యం జరుగుతున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో దిల్లీ క్రైం బ్రాంచ్‌, మిలిటరీ ఇంటెలిజెన్స్‌ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. దిల్లీలోని ఎయిర్‌ఫోర్స్‌ రికార్డ్‌ ఆఫీస్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తోన్న దేవేంద్ర నారాయణ్‌ శర్మ ద్వారా సమాచారం బయటకు వెళ్తున్నట్లు గుర్తించి ఈ నెల 6వ తేదీన అతడిని కస్టడీలో తీసుకొంది. ఈ విషయాన్ని దిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు.

పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ ద్వారా దేవేంద్ర హనీట్రాప్‌లో చిక్కుకున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. సామాజిక మాధ్యమాల ద్వారా దేవేంద్రను ఆమె ట్రాప్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. రక్షణ రంగ కార్యాలయాలు, స్థావరాలు, సిబ్బందికి సంబంధించిన అత్యంత సున్నితమైన, కీలక సమాచారాన్ని దేవేంద్ర సదరు మహిళతో పంచుకున్నట్లు భావిస్తున్నారు. ఇందుకు గానూ ఆయనకు డబ్బులు కూడా చెల్లించినట్లు తెలిసింది. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దేవేంద్ర నుంచి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. ఆయన బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దేవేంద్రను తక్షణమే విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు.

గతేడాది జులైలో ఆర్మీకి చెందిన ఓ వ్యక్తి కూడా రక్షణ శాఖకు చెందిన కీలక పత్రాలను పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐకు అందించిన విషయం తెలిసిందే. దీంతో అతడిని విధుల నుంచి తొలగించి అరెస్టు చేశారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts