IAF MiG21 squadron: అభినందన్‌ స్క్వాడ్రన్‌కు సెప్టెంబర్‌ చివర్లో విశ్రాంతి..!

వాయుసేన బాలాకోట్‌పై దాడుల అనంతర పరిణామాల్లో వీరోచితంగా పోరాడిన ‘స్వార్డ్‌ ఆర్మ్స్‌’ (Sword Arms) స్క్వాడ్రన్‌కు విశ్రాంతిని ఇవ్వనున్నారు. 2019లో భారత విమానాలు పాక్‌ ఎఫ్‌-16లను వెంబడించిన సమయంలో ఈ స్క్వాడ్రన్‌లో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ కూడా సభ్యుడు. భారత

Published : 21 Sep 2022 02:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాయుసేన బాలాకోట్‌పై దాడుల అనంతర పరిణామాల్లో వీరోచితంగా పోరాడిన ‘స్వార్డ్‌ ఆర్మ్స్‌’ (Sword Arms) స్క్వాడ్రన్‌కు విశ్రాంతిని ఇవ్వనున్నారు. 2019లో భారత విమానాలు పాక్‌ ఎఫ్‌-16లను వెంబడించిన సమయంలో ఈ స్క్వాడ్రన్‌లో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ కూడా సభ్యుడు. భారత వాయుసేనలో  మిగ్‌-21లను వినియోగిస్తున్న నాలుగు స్క్వాడ్రన్లలో స్వార్డ్‌ ఆర్మ్స్‌ కూడా ఒకటి. సాధారణంగా వాయుసేనలో దీనిని 51వ స్క్వాడ్రన్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం శ్రీనగర్‌ కేంద్రంగా ఇది పనిచేస్తోంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం 51వ స్క్వాడ్రన్‌కు సెప్టెంబర్‌ చివరి నాటికి విశ్రాంతిని ఇస్తున్నామని రక్షణశాఖ వర్గాలు పీటీఐకు వెల్లడించాయి. మిగిలిన మిగ్‌-21 స్క్వాడ్రన్లకు 2025 చివరి నాటికి విశ్రాంతిని ఇవ్వనున్నారు. 

1985లో ఈ స్క్వాడ్రన్‌ను ప్రారంభించారు. దీనికి తొలుత మిగ్‌-21 టైప్‌ 75 రకం విమానాలను ఇచ్చారు. ఆ తర్వాత అప్‌గ్రేడ్‌ చేసి మిగ్‌-21 బైసన్‌ రకం ఫైటర్‌జెట్లను వాడుతోంది. ఇది చాలా కీలక ఆపరేషన్లలో పాల్గొంది. 1999లో కార్గిల్‌ యుద్ధ సమయంలో ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌లో స్వార్డ్‌ ఆర్మ్స్‌ కీలక పాత్ర పోషించింది. ఇక 2019 ఫిబ్రవరి 26వ తేదీ అర్థరాత్రి భారత వాయుసేన విమానాలు బాలాకోట్‌లోని జైషే ఉగ్రసంస్థ క్యాంప్‌ను ధ్వంస చేశాయి.ఆ మార్నాడు ఉదయం పాక్‌ విమనాలు భారత గగనతలంలోకి చొరబడటంతో భారత వాయుసేనలో స్వార్డ్‌ ఆర్మ్స్‌ స్క్వాడ్రన్‌ మిగ్‌-21లు వాటిని అడ్డుకొన్నాయి. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ విమానాన్ని పాక్‌ ఎఫ్‌-16 కూల్చివేసింది. అదే సమయంలో అభినందన్‌ విమానం ఓ క్షిపణిని ప్రయోగించి పాక్‌ ఎఫ్‌-16 కూడా కూల్చివేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని