బెంగళూరులో వాయసేన కొవిడ్‌ ఆసుపత్రి

కొవిడ్‌ పోరాడేందుకు భారత త్రివిధ దళాలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే సైన్యం పలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటుండగా.. తాజాగా వాయు సేన

Published : 05 May 2021 02:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌పై పోరాడేందుకు భారత త్రివిధ దళాలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే సైన్యం పలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటుండగా.. తాజాగా వాయు సేన కూడా జతకలిసింది. బెంగళూరులో వాయుసేన స్థావరంలో 100 పడకల వైద్యశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. మే 6వ తేదీ నాటికి 20 పడకలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని వాయుసేన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. 

‘‘సాధారణ ప్రజల కోసం  బెంగళూరులోని జలహళ్లి ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో 100 పడకల కొవిడ్‌ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వాయుసేన నిర్ణయించింది. తొలుత 6వ తేదీ నాటికి 20 పడకలను ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లలో కలిపి అందుబాటులోకి తీసుకొస్తాము. మే20 నాటికి మిగిలిన 80 పడకలు కూడా అందుబాటులోకి వస్తాయి’’ అని వాయుసేన పేర్కొంది. ఇక్కడ మొత్తం 10 ఐసీయూ పడకలు, గొట్టపు మార్గంలో ఆక్సిజన్‌ సరఫరా అయ్యే 40 పడకలు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లతో 50 పడకలు ఏర్పాటు చేయనున్నారు. 

ఆ ఆసుపత్రిలో పనిచేసేందుకు బెంగళూరు కమాండ్‌ హాస్పటల్‌లోని నిపుణులు, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించానున్నారు. దీనిని రోగుల అడ్మిషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోడల్‌ ఆఫీసర్‌ సాయంతో రోగులను చేర్చుకొని చికిత్స అందించనున్నారు. ఈ ఆసుపత్రికి భద్రత, ఔషధ సరఫరాలు, ఆక్సిజన్‌ వంటివి కేంద్ర ప్రభుత్వం నుంచి అందనున్నాయి. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని