IAF: కుప్పకూలిన వాయుసేన శిక్షణ విమానం..!

భారత వాయుసేనకు చెందిన ఓ శిక్షణ విమానం కర్ణాటకలోని చామరాజనగర సమీపంలో నేలకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.

Updated : 01 Jun 2023 15:02 IST

బెంగళూరు: భారత వాయుసేనకు (IAF) చెందిన ఓ శిక్షణ విమానం (Kiran Aircraft)  ప్రమాదానికి గురైంది. కర్ణాటక (Karnataka)లోని చామరాజనగర్‌ (Chamrajnagar) సమీపంలో అది కుప్పకూలింది. అయితే, ఈ ఘటనలో విమానంలోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అందులో ఒక మహిళా పైలట్‌ ఉన్నారు. వాయుసేన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

‘రోజువారీ శిక్షణ కార్యకలాపాల్లో భాగంగా వాయుసేనకు చెందిన ‘కిరణ్‌’ శ్రేణి విమానం.. బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరింది. ఈ క్రమంలోనే చామరాజనగర్‌ సమీపంలోని భోగాపుర గ్రామంలో బహిరంగ ప్రదేశంలో అది కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు.. భూమిక, తేజ్‌పాల్‌ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే దీనిపై విచారణకు ఆదేశించిన’ట్లు వాయుసేన తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని