శ్రీలంక స్వాతంత్ర్య వేడుకల్లో భారత మెరుపులు

శ్రీలంక 70వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా నిర్వహించే గగనతల విన్యాసాల్లో భారత వైమానికదళం కూడా పాల్గొననుంది. మార్చి 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే విన్యాసాల్లో భారత వైమానికదళంలోని....

Updated : 28 Feb 2021 14:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: శ్రీలంక 70వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా నిర్వహించే గగనతల విన్యాసాల్లో భారత వైమానికదళం కూడా పాల్గొననుంది. మార్చి 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే విన్యాసాల్లో భారత వైమానికదళంలోని సూర్యకిరణ్‌, సారంగ్‌, తేజస్‌ విమానాలకు చెందిన బృందాలు పాల్గొననున్నాయి. ఆయా విమానాలు శనివారం శ్రీలంకను చేరుకున్నాయి. సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ బృందం 2001లో జరిగిన శ్రీలంక 50వ స్వాతంత్ర్య వేడుకల్లో కూడా పాలుపంచుకొంది. శ్రీలంక వైమానిక దళం, తాము కలిసి శిక్షణ, నిర్వహణ పరమైన మార్పులు, సైనిక విద్యవంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవడం సహా పలు చర్చలు జరుపుతున్నట్లు భారత వైమానిక దళం తెలిపింది. తమ 70వ స్వాతంత్ర్య వేడుకల్లో భారత వైమానిక దళం పాల్గొననుండటం ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని శ్రీలంక పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని