
Walk With Dog: పెంపుడు కుక్కతో వాకింగ్.. ఐఏఎస్ కోసం స్టేడియం ఖాళీ
దిల్లీలో ఓ ఐఏఎస్ అధికారి నిర్వాకంపై తీవ్ర విమర్శలు
దిల్లీ: పెంపుడు శునకంతో నిత్యం వాకింగ్‌కి వెళ్లే ఓ ఉన్నతోద్యోగి.. అందుకోసం స్టేడియం మొత్తం ఖాళీ చేయిస్తున్న ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకొంది. ఈ నిర్ణయం క్రీడాకారులు, శిక్షణకులకు తీవ్ర ఆటంకం కలిగించడంతోపాటు తీవ్ర విమర్శలకు కారణమైంది. బాధ్యతగా మెలగాల్సిన ఓ ఐఏఎస్ అధికారి చేస్తోన్న నిర్వాకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో స్పందించిన దిల్లీ ప్రభుత్వం.. రాత్రి పది గంటల వరకు స్టేడియం అందరికీ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించింది.
దిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో సాధారణంగా సాయంత్రం ఏడు గంటలవరకు క్రీడాకారులు, శిక్షకులతో బిజీ ఉంటుంది. అయితే, దిల్లీ రెవిన్యూ కార్యదర్శి సంజీవ ఖిర్వార్ మాత్రం ఆ స్టేడియాన్ని తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఇందుకోసం నిర్ణీత సమయం కంటే (సాయంత్రం 7గంటలు) ముందే క్రీడాకారులను స్టేడియం నుంచి వెళ్లగొట్టాలని నిర్వాహకులకు సూచించారు. దీంతో సాయంత్రం ఏడు గంటలకంటే ముందు క్రీడాకారులు, శిక్షకులను బయటకు పంపిస్తోన్నారు. అనంతరం ఓ అరగంట తర్వాత ఆ ఐఏఎస్ అధికారి తన పెంపుడు శునకంతో అక్కడకు చేరుకొని తాపీగా వాకింగ్ చేసుకుంటున్నారు.
గత కొన్ని నెలలుగా ఐఏఎస్ అధికారి చేస్తోన్న నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిత్యం రాత్రి 8.30 వరకు సాధన చేసేవాళ్లమని.. ఐఏఎస్ అధికారి తీరుతో తమకు ఆటంకం కలుగుతోందని క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో ప్రతిపక్షాలు కూడా ఐఏఎస్ తీరుపై మండిపడ్డాయి. దేశ రాజధానిలోని ఉన్నతాధికారులే ఇలా ప్రవర్తిస్తే ఇక జిల్లా స్థాయిలో వారితీరు ఎలా ఉంటుందోనని కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ విమర్శలు గుప్పించారు.
ఇలా ఐఏఎస్ వాకింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రాత్రి 10 గంటల వరకు నగరంలోని స్టేడియాలన్నీ క్రీడాకారులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వెల్లడించారు. ఇదే విషయంపై సదురు ఐఏఎస్ అధికారిని మీడియా వివరణ కోరగా.. తనతోపాటు తన పెంపుడు శునకాన్ని అప్పుడప్పుడు వాకింగ్‌కు తీసుకువెళ్లిన మాట వాస్తవమేనన్నారు. అయితే, అది క్రీడాకారులు, శిక్షకులకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదని చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CM Jagan: పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి: సీఎం జగన్
-
General News
KTR: వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే: కేటీఆర్
-
Politics News
Maharashtra: విశ్వాస పరీక్షలో నెగ్గిన ఏక్నాథ్ శిందే..
-
General News
Kishan Reddy: ఇచ్చిన మాట ప్రకారం మోదీ భీమవరం వచ్చారు: కిషన్‌రెడ్డి
-
Movies News
Alluri Sitarama Raju: వెండితెరపై వెలిగిన మన్యం వీరులు వీరే..
-
Sports News
Jasprit Bumrah: ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రా మరో రికార్డు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- బిగించారు..ముగిస్తారా..?
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య