CA exams వాయిదా

దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) కీలక నిర్ణయం....

Updated : 27 Apr 2021 21:28 IST

దిల్లీ: దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మే 21 నుంచి జరగాల్సిన ఛార్టెడ్‌ అకౌంటెంట్ ఫైనల్‌ పరీక్షలు, 22 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కొవిడ్‌ దృష్ట్యా విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కరోనా పరిస్థితిని సమీక్షించుకొని కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. పరీక్షలకు కనీసం 25 రోజుల ముందుగానే విద్యార్థులకు సమాచారం ఇస్తామని తెలిపింది. అభ్యర్థులు www.icai.org వెబ్‌సైట్‌లో అప్‌డేట్స్‌ను తెలుసుకోవచ్చని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని