ఐసీఎస్‌ఈ 10, 12పరీక్షలు వాయిదా 

కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో ఐసీఎస్‌ఈ బోర్డు పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి....

Updated : 16 Apr 2021 19:49 IST

దిల్లీ: కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో ఐసీఎస్‌ఈ బోర్డు పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఐసీఎస్‌ఈ పది, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ద కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్‌ (సీఐఎస్‌సీఈ) ఓ ప్రకటనలో వెల్లడించింది. పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయాన్ని జూన్‌ తొలి వారంలో వెల్లడిస్తామని స్పష్టంచేసింది. ఇప్పటికే సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు రద్దు కాగా.. 12వ తరగతి పరీక్షలను కేంద్రం వాయిదా వేసిన విషయం తెలిసిందే. సీబీఎస్‌ఈ పరీక్షల తరహాలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు పది తరగతి పరీక్షలు రద్దు చేయడంతో పాటు మిగతా పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.


* తెలంగాణలో శనివారం జరగాల్సిన ఎస్సీ గురుకుల ప్రతిభ కళాశాలల రెండో ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. కరోనా తీవ్రత కారణంగా సీఓఈ రెండో స్క్రీనింగ్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు.

* 2020-21 సంవత్సరానికి గానూ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తు గడువును కూడా పొడిగించారు. కొత్త, రెన్యూవల్ దరఖాస్తుల కోసం మే 31 వరకు ఈ పాస్ పోర్టల్ పనిచేయనుందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts