IMA: బాబా రాందేవ్‌పై కేసు నమోదు చేయండి
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అల్లోపతి వైద్య శాస్త్రం, వైద్యులను అవమానించేలా మాట్లాడారని భారత వైద్య సంఘం (ఐఎంఏ) ఆరోపించింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ తక్షణం స్పందించి ఆయనపై కేసు నమోదు చేయాలని ఐఎంఏ నాయకులు డిమాండ్ చేశారు.
కేంద్ర ఆరోగ్యశాఖను డిమాండ్ చేసిన భారత వైద్య సంఘం
దిల్లీ: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అల్లోపతి వైద్య శాస్త్రం, వైద్యులను అవమానించేలా మాట్లాడారని భారత వైద్య సంఘం (ఐఎంఏ) ఆరోపించింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ తక్షణం స్పందించి ఆయనపై కేసు నమోదు చేయాలని ఐఎంఏ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఐఎంఏ సామాజిక మాధ్యమాల్లో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. కరోనా కాలంలో ఎన్నో ఒడిదొడుకులకు గురవుతూ, వైద్యులు శ్రమిస్తుంటే ఈ విధమైన నిందలు తగవని ఆ ప్రకటనలో పేర్కొంది. బాబా రాందేవ్‌పై కేసు నమోదు చేయకుంటే ఆధునిక వైద్య శాస్త్రాన్ని రద్దు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని ఐఎంఏ నాయకులు కోరారు. లేదంటే అంటువ్యాధుల చట్టం కింద బాబా రాందేవ్‌పై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయడం ద్వారా ఆరోగ్య కార్యకర్తలు, రోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు.
తాజాగా బాబా రాందేవ్ ఆధునిక వైద్యశాస్త్రాన్ని, వైద్య విధానాలను అవమానించే విధంగా మాట్లాడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గతంలో కూడా బాబా రాందేవ్ ఆధునిక వైద్యులను హంతకులుగా అభివర్ణించి విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రజలు ఆక్సిజన్ కొరతతో అల్లాడుతుంటే ‘వారికి సరిగా శ్వాస తీసుకోవడం కూడా రావట్లేదు’ అంటూ ఎద్దేవా చేశారు.
అల్లోపతి వైద్యశాస్త్రం, వైద్యులకు వ్యతిరేక మాటల నేపథ్యంలో యోగా గురువు బాబా రాందేవ్‌కు భారత వైద్యసంఘం(ఐఎంఏ) లీగల్ నోటీసు పంపించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Ileana: ఆసుపత్రిలో చేరిన ఇలియానా.. త్వరగా కోలుకోవాలంటున్న ఫ్యాన్స్
-
India News
Droupadi Murmu: ధైర్యవంతమైన ప్రభుత్వం.. విప్లవాత్మక నిర్ణయాలు: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
Crime News
Andhra News: అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్: ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు
-
Crime News
Road Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు
-
India News
Modi: బడ్జెట్ సమావేశాలకు ముందే.. ప్రపంచం నుంచి సానుకూల సందేశాలు..!