Published : 09 May 2021 00:54 IST

ఇకనైనా మేల్కోండి.. లాక్‌డౌన్‌ పెట్టండి: IMA

దిల్లీ: దేశంలో కరోనా కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పెట్టాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) కేంద్రాన్ని కోరింది. దీనివల్ల వైరస్‌ చైన్‌ను బ్రేక్‌ చేయడంతో పాటు కొవిడ్‌ రోగులకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న మెడికల్‌ సిబ్బందికి కొంతమేర స్వస్థత చేకూరుతుందని అభిప్రాయపడింది. కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ కారణంగా తలెత్తిన సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పటికైనా మేల్కోవాలంటూ ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు ఘాటు లేఖ రాసింది. సెకండ్‌వేవ్‌ వేళ ఆ శాఖ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే తమకు ఆశ్చర్యమేస్తోందని పేర్కొంది. తమ అసోసియేషన్‌ నుంచి కేంద్రానికి ఇచ్చిన సలహాలు, సూచనలు పలుమార్లు బుట్టదాఖలు అయ్యాయని ఆవేదన వ్యక్తంచేసింది.

ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న వైరస్‌ను అదుపులోకి తేవాలంటే ప్రణాళికతో కూడిన లాక్‌డౌన్‌ను విధించాలని తన లేఖలో ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రాలు అమలు చేస్తున్న 10-15 రోజుల లాక్‌డౌన్‌ కాకుండా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అవసరమని పేర్కొంది. అలాగే, రాత్రిపూట కర్ఫ్యూలు విధించడం వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేదంది. ఆర్థికం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని అభిప్రాయపడింది.  కేంద్రం చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రణాళికనూ తప్పుబట్టింది. ముందుచూపు లేకపోవడం వల్లే ఇప్పటికీ చాలా చోట్ల 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందించలేని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. పోలియో, మశూచి వంటి వ్యాధులకు సార్వత్రిక టీకా విధానాన్ని అవలంబించిన కేంద్రం.. ఇప్పుడెందుకు వేర్వేరు ధరలకు టీకాలు అందజేయాల్సి వస్తోందని ప్రశ్నించింది. ఆక్సిజన్‌ కొరత, వైద్యులు వైరస్‌ బారిన పడడం వంటి సంఘటనలపై ఆందోళన వ్యక్తంచేసింది. ప్రజా వైద్యానికి జీడీపీలో 8 శాతం మేర కేటాయింపులు జరపాలని తన లేఖలో సూచించింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని