Ramdev బాబాపై రూ.1000కోట్ల దావా

అల్లోపతి వైద్యంపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు యోగా గురు రాందేవ్‌ బాబాపై ఉత్తరాఖండ్ వైద్యుల బృందం రూ. 1000కోట్లకు పరువు నష్టం దావా వేసింది. 15 రోజుల్లోగా రాందేవ్‌

Published : 26 May 2021 13:28 IST

డెహ్రాడూన్‌: అల్లోపతి వైద్యంపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్‌ బాబాపై ఉత్తరాఖండ్ వైద్యుల బృందం రూ.1000కోట్లకు పరువు నష్టం దావా వేసింది. 15 రోజుల్లోగా రాందేవ్‌ బాబా లిఖితపూర్వక క్షమాపణలు తెలియజేయాలని.. లేదంటే రూ.1000 కోట్లు చెల్లించాలని ఐఎంఏ(ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌) ఉత్తరాఖండ్‌ నోటీసులు పంపింది. దీంతో పాటు ఆయనసై సత్వర, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్‌ రావత్‌కు లేఖ రాసింది.

అల్లోపతి వైద్యంపై ఇటీవల రాందేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘అల్లోపతి పనికిమాలిన వైద్యం’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఓ వీడియో గతవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో భారత వైద్య మండలితో పాటు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అల్లోపతి వైద్యంపై మీ వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం. ఇది కరోనా యోధులను అవమానించడమే కాదు.. ఆరోగ్య కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమే. మీ మాటలు ఉపసంహరించుకోండి’ అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌.. యోగా గురు రాందేవ్‌బాబాకు ఆదివారం ఘాటుగా లేఖ రాశారు. దీంతో వెనక్కి తగ్గిన రాందేవ్‌.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అన్ని రకాల వైద్యాలను తాను గౌరవిస్తానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని