వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలి: మోదీ

కరోనా వైరస్‌ నియంత్రణకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తంచేశారు. వ్యాక్సినేషన్‌ పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో ....

Updated : 26 Jun 2021 22:24 IST

దిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రణకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తంచేశారు. వ్యాక్సినేషన్‌ పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్షించారు. వ్యాక్సిన్‌ పంపిణీలో వేగం కొనసాగడం ఎంతో ముఖ్యమన్నారు. ఇందుకోసం ఎన్జీవోలు, ఇతర సంస్థలను భాగస్వాముల్ని చేయాలని సూచించారు. మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం అనంతరం పీఎంవో ప్రకటన విడుదల చేసింది. గత ఆరు రోజుల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా 3.77 కోట్లకు పైగా డోసులు పంపిణీ జరిగిందని, ఇది మలేషియా, సౌదీఅరేబియా, కెనడా వంటి దేశాల మొత్తం జనాభాకు సమానమని ప్రధానికి అధికారులు వివరించినట్టు పేర్కొంది.

వైరస్‌ను గుర్తించి కట్టడి చేయడంలో కీలక అస్త్రం టెస్టింగేనని, అందువల్ల పరీక్షల్లోనూ వేగం తగ్గకుండా రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని అధికారులను ఆదేశించారని తెలిపింది. ఈ సమావేశంలో వయసుల వారీగా వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించిన వివరాలను అధికారులు ప్రధానికి వివరించారు. అలాగే, ఆయా రాష్ట్రాల్లో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, సాధారణ ప్రజలకు అందజేసిన వ్యాక్సిన్‌ వివరాలను కూడా తెలియజేసినట్టు పీఎంవో పేర్కొంది. రాబోయే నెలల్లో వ్యాక్సిన్‌ పంపిణీ, ఉత్పత్తిని పెంచే అంశాలపైనా చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని