Karnataka: బజరంగ్ దళ్ కార్యకర్త హత్యపై దర్యాప్తు ముమ్మరం.. ఆరుగురి అరెస్ట్

కర్ణాటక శివమొగ్గలో ఉద్రిక్తతలకు దారితీసిన బజరంగ్‌ దళ్‌ కార్యకర్త హర్ష హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరుగురు యువకులను అరెస్టు చేశారు.....

Published : 22 Feb 2022 23:46 IST

బెంగళూరు: కర్ణాటక శివమొగ్గలో ఉద్రిక్తతలకు దారితీసిన బజరంగ్‌ దళ్‌ కార్యకర్త హర్ష హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఆరుగురు యువకులను అరెస్టు చేశారు. మరి కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరెస్టుయిన వారందరికి క్రిమినల్‌ రికార్డులున్నాయని డీజీపీ ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. హత్యతో సంబంధం ఉన్న మరికొందరిని గుర్తించామని, త్వరలోనే వారందరినీ అరెస్టు చేస్తామని తెలిపారు. శివమొగ్గ పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉన్నప్పటికీ.. పలువురు నిబంధనలు అతిక్రమించారని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపైనా కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 144 సెక్షన్‌ను శుక్రవారం ఉదయం వరకు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.

శివమొగ్గ భారతీనగర్‌లో ఆదివారం రాత్రి కారులో వచ్చిన పలువురు దుండగులు.. బజరంగ్‌దళ్‌ కార్యకర్త హర్షను కత్తితో పొడిచి హత్యచేశారు. సోమవారం నిర్వహించిన హర్ష అంతిమయాత్రలో దాదాపు 5 వేలమంది పాల్గొనగా.. అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. ఈ ఘటనలో హింస చెలరేగి ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో శివమొగ్గ సహా పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. హర్ష హత్య తర్వాత శివమొగ్గలో 14 హింసాత్మక ఘటనలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వీటిపై ఇప్పటివరకు 3 ఎఫ్​ఐఆర్​లు నమోదుచేసినట్లు తెలిపిన పోలీసులు మరిన్ని కేసుల నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు