తమిళనాడులో 234 కిలోల బంగారం స్వాధీనం

శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న తమిళనాడులో భారీ ఎత్తున బంగారం రవాణాను గుర్తించడం కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి సేలం-చెన్నై హైవే మార్గంలో అధికారులు నిర్వహించిన

Updated : 14 Mar 2021 14:29 IST

చెన్నై: శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న తమిళనాడులో భారీ ఎత్తున బంగారం రవాణాను గుర్తించడం కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి సేలం-చెన్నై హైవే మార్గంలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 234 కిలోల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రాష్ట్రమంతటా విస్తృత వాహన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సేలం-చెన్నై జాతీయ రహదారిపై పెరియారీ ప్రాంతంలో ఎన్నికల నిఘా దళాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చెన్నై నుంచి సేలం వైపు వస్తున్న ఓ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేస్తుండగా.. అందులో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను గుర్తించారు. ఈ బంగారానికి సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్‌, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

ఈ నగలను చెన్నైలోని ఓ పేరున్న నగల దుకాణం నుంచి సేలంకు తీసుకెళ్తున్నామని, అక్కడ స్థానిక వ్యాపారులకు వీటిని సరఫరా చేయాలని సదరు వ్యక్తులు విచారణలో తెలిపారు. అయితే ఆభరణాలకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఘటనపై లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్లకు పంచేందుకే ఈ బంగారాన్ని తీసుకొస్తున్నారా? అన్న కోణంలో విచారించనున్నట్లు తెలిపారు. 


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని